KRNL: చిప్పగిరి మండలంలోని గుమ్మనూరు గ్రామానికి హంపీ పీఠాధిపతి విద్యానంద భారతి స్వామి విచ్చేశారు. గ్రామానికి చెందిన గుమ్మనూరు నారాయణ దంపతులు స్వామివారికి ఘన స్వాగతం పలికారు. స్వామివారి ఆశీస్సులు పొందేందుకు గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఇవాళ తరలివచ్చారు. భక్తులకు స్వామివారు ఆశీర్వచనాలు అందజేయగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.