VSP: ఇసుక కొండపై వేంచేసి ఉన్న శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో మంగళవారం ఆశ్వయుజ మాస పౌర్ణమి పరిష్కరించుకుని విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.