NDL: నిజాన్ని నిర్భయంగా రాసే పత్రిక విలేకరులకు స్వేచ్ఛ ఉండాలని పాత్రికేయుల సంఘం నాయకులు నాగేష్, పగడం గోపి తెలిపారు. ఆదివారం నంది కోట్కూరు అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ పత్రిక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. నాగేష్ మాట్లాడుతూ.. సమాజం పట్ల బాధ్యతగా ఉండే పాత్రికేయులపై దాడులు చేయడం సరి కాదన్నారు.