W.G: పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ సమీప టీస్టా నదిలో శీతాకాల శిక్షణలో పాల్గొన్న జిల్లాకు చెందిన ఓ ఆర్మీ జవాన్ గల్లంతయ్యాడు. పెనుమంట్ర మండలం ఆలమూరుకు చెందిన శేఖర్ శిక్షణ సందర్భంగా నదిలో కొట్టుకుపోయినట్లు సమాచారం. రెస్క్యూ ఆపరేషన్ అనంతరం శేఖర్ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ వార్తతో శేఖర్ స్వగ్రామమైన ఆలమూరులో తీవ్ర విషాదం నెలకొంది.