KKD: విజయవాడలో కొలువుతీరియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారిని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదివారం దర్శించారు. ముందుగా ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే కొండబాబుకు అర్చకులు ఆశీర్వాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలు కొండబాబుకు అందజేశారు