BPT: బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు శనివారం రుతుక్రమం పరిశుభ్రత అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు సీడీపీవో సుధా మాట్లాడుతూ.. యుక్త వయసులో ఉన్న బాలికలు రూతుక్రమంపై అవగాహన కల్పించుకోవాలని సూచించారు. అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. బయట సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలో అనేది వివరించారు.