W.G: ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో ఉన్న శ్రీ భీమేశ్వరస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఆలయం ప్రాంగణంలో జరిగింది. దేవస్థానం ఛైర్మన్ వేగేశ్న రామ్మూర్తిరాజు, సభ్యులతో ఆకివీడు గ్రూపు దేవాలయాల ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు.