CTR: బంగారుపాళ్యం మండల పరిషత్ కార్యాలయంలో చిత్తూరు జిల్లా సీఈవో రవికుమార్ నాయుడు, డీపీవో సుధాకర్ రావును వైసీపీ నాయకులు కలిశారు. ఇందులో భాగంగా ఎంపీటీసీల గౌరవ వేతనాల సమస్యలపై చర్చించిన వారు గత నాలుగేళ్లలో కేవలం 11 నెలలకే వేతనాలు ఖాతాలలో జమయ్యాయని తెలిపారు. వైసీపీ కన్వీనర్ రామచంద్రా రెడ్డి, వైస్ ఎంపీపీ శిరీష్ రెడ్డి, మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ అమర్నాథ్ పాల్గొన్నారు.