కృష్ణా: కూటమి ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శుక్రవారం చల్లపల్లి నారాయణరావు నగర్లో 15వ ఫైనాన్స్ కమిషన్ హెల్త్ గ్రాంట్స్ నిధులు రూ.36 లక్షలతో నిర్మించనున్న గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శుక్రవారం శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు పాల్గొన్నారు.