KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టులో జరిగిన పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. వెంకట బస రావు ఆదేశాల మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 462 మంది హాజరుకాగా 413 మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు.