KKD: జిల్లా నుంచి మెగా డీఎస్సీ-2024 పరీక్షకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులకు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్ షాన్ మోహన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ కేంద్రంగా జనవరి 2వ తేదీ నుంచి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని వివరించారు. ప్రాక్టీస్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తామన్నారు.