ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక మాసం తొలి శనివారం భక్తాదులు ఆలయానికి పోటెత్తారు. ఆలయంలో స్వామికి సింధూరం, ఆకుపూజ తదితర పూజలు నిర్వహించారు. రాత్రి స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా అలంకరించిన వెండిరథంలో కొలువు తీర్చారు. అనంతరం ఆలయ ఆవరణంలో ప్రాకారోత్సవం నిర్వహించారు.