SKLM: శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు మొంథా తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. రానున్న 4 రోజులపాటు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిందన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని మంత్రి సూచించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.