E.G: మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రామ్మోహన్ రావు వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో గురువారం రాజమండ్రిలో నివాళులర్పించారు. రాజా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి, ఎమ్మెల్యేగా రామ్మోహన్ రావు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా మాజీ ప్రచార కమిటీ సభ్యులు రామకృష్ణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.