VZM: సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన పీజీఅర్ఎస్లో జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ప్రజల నుండి వినతుల స్వీకరించారు. పీజీఅర్ఎస్కు మొత్తం 162 వినతులు అందాయి. వీటిలో రెవిన్యూ శాఖకు సంబంధించి 64, డీఆర్డీఏకు 47, పంచాయతీ శాఖకు 7, పురపాలక సంఘాలకు 6, ఇతర శాఖలకు సంబంధించి 38 వినతులు స్వీకరించారు.