VSP: విశాఖలో జరిగే శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి పందిరి రాట మహోత్సవానికి విచ్చేయవలసిందిగా కలెక్టర్ ఎంఎన్.హరేంధిర ప్రసాద్‌ను దేవస్థానం ఆహ్వానించింది. మార్గశిర మాసోత్సవాల సందర్భంగా నవంబర్ 1వ తేదీన ఈ మహోత్సవం జరగనుంది. ఈ మేరకు దేవస్థానం ఈవో శోభారాణి, ఏఈవో రాజేంద్ర, వేదపండితులు లక్ష్మీనారాయణ, ప్రధాన అర్చకులు శ్రీనివాస్‌లు నిన్న ఆయనను కలిసారు.