VZM: జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని, గజపతినగరం విజయనగరం రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు నిర్మాణం చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం గజపతినగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎస్ఎఫ్ఐ 32వ జిల్లా మహాసభలు జిల్లా అధ్యక్షులు డి. రాము అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూడి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.