SKLM: ప్రతిరోజూ ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలో అనుకోని సంఘటనల ద్వారా గుండెపోటుకు గురవుతున్నారని జిల్లా రెడ్ క్రాస్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ జి.రమణ పేర్కొన్నారు. సోమవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థులకు CPRపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అత్యవసర సమయంలో ప్రధమ చికిత్స ఏ విధంగా చెయ్యాలో వివరించారు.