ATP: కుందుర్పి మండల ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కుందుర్పమ్మ జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రూ.3 లక్షల విరాళం అందజేశారు. సోమవారం కళ్యాణదుర్గంలోని తన కార్యాలయంలో గ్రామ పెద్దలు, జాతర కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులకు ఈ నిధులను అందజేసి, ఉత్సవాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.