KRNL: నగరంలో పారిశుద్ధ్యాన్ని మరింత మెరుగుపరచాలని నగర కమిషనర్ పి. విశ్వనాథ్ సంబంధిత సిబ్బందికి సూచించారు. సోమవారం ఆయన బళ్ళారి చౌరస్తా పరిసర ప్రాంతాల్లో పలు కాలనీల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ప్రతిరోజు మధ్యాహ్నం తరువాత పూడికతీత పనులు పూర్తిగా జరిగేలా చూడాలని, వారానికి కనీసం ఒక్కసారి ప్రతి వీధిలో పూడికలు తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు.