SKLM: రాగోలు వద్ద ఉన్న ఓ ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి షోరూంలో ఉన్న 12 ఎలక్ట్రిక్ వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.15 లక్షలుగా అంచనా వేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానికులు సమాచారంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను అదుపులోకి తీసుకున్నారు.