NLR: బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ స్వామి అమ్మవార్లను జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు సయాని విజయ భారతి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అతిధుల గోత్రనామాలతో శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదములు అందజేశారు.