కడప: జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో సోమవారం నుండి కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుభ్య పరీక్షల జరగనున్న సందర్భంగా ఎ ఎస్పీ ప్రకాష్ బాబు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన డి.టి.సి మైదానంలో పోలీసుఅధికారులు, సిబ్బందితో సమావేశమై దేహదారుఢ్య పరీక్షల దగ్గర ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆర్.ఎఫ్.ఐ.డీ సాంకేతిక పరిజ్ఞానంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయలన్నారు.