ATP: తాడిపత్రి మండలం చిన్న పడమల గ్రామంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించి గంగాధర్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 180 ప్యాకెట్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంగాధర్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్న అధికారులు బియ్యాన్ని రెవెన్యూ శాఖకు అప్పగించారు. అనంతరం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.