E.G: రాజమండ్రి, ధవలేశ్వరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలోని ఏపీ ఎన్.జీ.వో సంఘం యూనిట్లకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని ఏపీ ఎన్.జీ.వో సంఘ జిల్లా ఆడహక్ కమిటీ ఛైర్మన్ మీసాల మాధవరావు అన్నారు. శనివారం రాజమండ్రిలో ఎన్.జీ.వో సంఘ కమిటీ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి ఎన్.జీ.వో సంఘ నాయకత్వంతో కలిసి పనిచేస్తామన్నారు.