కృష్ణా: పామర్రు టౌన్లో జరిగే 10వ తరగతి పరీక్షా కేంద్రాలను ఎస్ఐ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, అలాగే ఏటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి చేరుకోవాలని సూచించారు.