E.G: కార్తీకమాసం సందర్భంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రాన్ని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆదివారం సందర్శించారు. గోమాతకు పూజ చేసి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పవిత్ర గోదావరి నది ఒడ్డున కొవ్వూరు గోష్పాద క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంట తూ.గో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.