NTR: వత్సవాయి మండలం మాచినేనిపాలెం గ్రామానికి చెందిన నాయకులు పాటిబండ్ల కోటేశ్వరరావు, సతీమణి పాటిబండ్ల సమత మరణించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను వారి స్వగృహానికి వెళ్లి, మృతదేహాలను దర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేవుడు వారికి ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.