ASR: రాజవొమ్మంగి గ్రామం మీదుగా వెళ్లే పంట కాలువ వ్యర్ధాలతో ముసుకుపోయింది. వట్టిగెడ్డ రిజర్వాయర్ నుంచి సుమారు 10 గ్రామాలలో పొలాలకు నీరందించే పంట కాలువలో కొందరు వ్యర్ధాలు వేస్తున్నారని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజవొమ్మంగి పోస్ట్ ఆఫీస్ పక్కన కాలువలో స్థానికులు ఎక్కువగా వ్యర్ధాలు వేస్తున్నారని, అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.