ATP: సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బండారు శ్రావణి కలిశారు. ఇటీవల ఎర్రగుంట్ల గ్రామ వాసులు కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సంఘటనలో తల్లి, కుమారుడు మరణించగా కూతురు తీవ్ర అనారోగ్యం పాలై బెంగళూరులో చికిత్స పొందారు. పేద కుటుంబం కావడంతో సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు.