W.G: భీమవరం కే.జీ.ఆర్.ఎల్ కళాశాలలో స్పేస్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన ఎకో ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాల ప్రదర్శన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్తమంగా తయారు చేసిన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం గణేష్ విగ్రహాల పోస్టర్ను ఆవిష్కరించారు.