GNTR: శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు చెప్పారు. సచివాలయ కార్యదర్శులు ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, ఆర్జీల పట్ల భాద్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సందర్భంగా మంగళవారం కమిషనర్ నల్లపాడు శ్రీనివాస కాలనీ నివాసితులు మౌలిక వసతులు కోరుతూ అందించిన అర్జీ మేరకు సదరు కాలనీ, ప్రాంతాల్లో పర్యటించారు.