ప్రకాశం: మార్కాపురంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం వేకువజామున స్వామివారి కళ్యాణమహోత్సవానికి మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నారాంబాబు హాజరై స్వామివారికీ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో అన్నారాంబాబు సతీమణి దుర్గకుమారి పాల్గొన్నారు. ముందుగా ఆలయ ధర్మకర్తలు అన్నారాంబాబును ఘనంగా సన్మానించారు.