VZM: విజయనగరం జమ్ము పడాల పేట, బేతని మిషన్ చర్చ్‌లో ఆదివారం ప్రసిద్ధ ఆధ్యాత్మిక బోధకులు డా.పాల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టల పండుగ ఘనంగా నిర్వహించారు. చిన్నారులు హర్షాతిరేకాలతో హోసన్నా పాటలతో ర్యాలీ నిర్వహించి, ప్రభువైన యేసయ్య జయ ప్రవేశాన్ని స్మరించుకున్నారు. అనంతరం ప్రత్యేక ప్రార్థన నిర్వహించి దేశంలో శాంతి, సామరస్యం మరియు సమృద్ధి కోసం ప్రార్థించారు.