కృష్ణా: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినిల్ కోరారు. వివిధ కారణాల దృష్ట్యా అంబేద్కర్ జయంతి వేడుకల ర్యాలీలకు గుడివాడ డివిజన్‌తో పాటు జిల్లావ్యాప్తంగా అనుమతులు లేవన్నారు. డీజేలు, మైక్ సెట్లను అనుమతించబోమని స్పష్టం చేశారు.