VSP: రాజ్యాంగ పరిరక్షణ మన లక్ష్యం అని సినీ నటుల ఆర్.నారాయణమూర్తి అన్నారు. ప్రజానాట్య మండలి కుల వివక్ష వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో త్యాగాలు చేసి మనకు రాజ్యాంగం తెచ్చిపెట్టారని, దాన్ని కాపాడుకోవాలని అన్నారు.