TPT: తిరుమల శ్రీవారిని అప్పట్లో నల్లరాయితో పోల్చిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి అని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు. ఆదివారం ఆయన టీటీడీ గోశాలను సందర్శించారు. నాస్తికుడైన భూమనకు గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి హిందూ ధర్మాన్ని నాశనం చేశారన్నారు. టీటీడీ లాంటి ధార్మిక సంస్థలతో రాజకీయం చేయడం తగదన్నారు.