సత్యసాయి: జిల్లాను ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. జనవరి 31 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో వాహనదారులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపేవారు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.