KDP: వర్షాల కారణంగా చేనేత కార్మికులు పనులు లేక జీవనాధారం కోల్పోయి కష్టాలు పడుతున్నారని జనసేన చేనేత కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. శుక్రవారం సిద్దవటం మండలంలోని పలు గ్రామాల్లో చేనేత మగ్గం గుంతలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. చేనేత కార్మికులు కుటుంబంలో అందరూ పనిచేస్తే గాని పూట గడవని జీవితాన్ని గడుపుతున్నారన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.