ELR: నూజివీడులో కేంద్రీయ విద్యాలయం స్థలంలో ఉన్న 25 లక్షల రూపాయల విలువైన వృక్షాలను ఈనెల 24న బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే వేలంలో 52 టేకు, 82 కొబ్బరి, 5 వేప చెట్లు ఉన్నాయి. ఆసక్తిగల వారు పాల్గొనవచ్చని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న గురువారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు.