E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరంలోని రాజీవ్ గృహాల వద్ద ఎస్పీ డి. నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు సీఐ టి. గణేశ్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ‘కార్డెన్ అండ్ సర్చ్’ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. ఈ క్రమంలో సరైన రికార్డులు లేని 13 మోటార్ వాహనాలను పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.