ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో సుమతి అనే మహిళ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. తల్లి సుశీల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరసింహారావు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై పేర్కొన్నారు.