GNTR: ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామ ఫ్లైఓవర్ సమీపంలో శుక్రవారం ఉదయం లారీ, ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడటంతో 108 అంబులెన్స్ ద్వారా గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.