పల్నాడు: కలెక్టర్ కృతికా శుక్లా ఇవాళ పిడుగురాళ్లలో జరిగిన ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన ఆమె పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేశారు. పరిశుభ్రత, పర్యావరణ సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. భావితరాల కోసం మెరుగైన భవిష్యత్తును అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కోరారు.