KDP: సికే దిన్నెలో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. జడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్మించిన ఆధునిక సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్‌ను కలెక్టర్ ఆదివారం పరిశీలించారు. మంత్రి నారా లోకేశ్ పర్యటనలో భాగంగా ఈ సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు.