NLR: కొడవలూరు మండలం టపాతోపు జాతీయ రహదారిపై కారంపొడి లోడ్‌తో వెళ్తున్న లారీ నుంచి పొడి లీక్ అయింది. అది పెద్ద ఎత్తున రోడ్డు మీద పడటంతో అటుగా వెళుతున్న వాహనదారుల కళ్లల్లో పడింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లారీని వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడం వల్లే కారంపొడి రోడ్డు మీద పడినట్లు సమాచారం.