GNTR: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఫిరంగిపురం గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు, సిబ్బందికి పంచాయతీ నిధుల నుంచి దుస్తులు, సబ్బులు, చెప్పులు తదితర వస్తువులను సర్పంచ్ మేడా బాబు సోమవారం పంచాయతీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.