KDP: రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు కృషి చేస్తోంది. తాజాగా కొర్రమీను చేపల పెంపకం ద్వారా ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా తక్కువ ఖర్చుతో ఏడాదికి రూ. 3 నుంచి రూ. 4 లక్షల వరకు ఆదాయం పొందొచ్చని అంచనా.. బ్యాంకుల ద్వారా రుణాలు అందించి, డ్వాక్రా సంఘాలలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తోంది.