ATP: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం రాత్రి అనంతపురంలోని హార్మనీ సిటీలో జబర్దస్త్ నటులు సందడి చేశారు. ప్రముఖ కమెడియన్ రాంప్రసాద్, మణికంఠ మాస్టర్‌తో పాటు పలువురు నటులు ఈ వేడుకల్లో పాల్గొని అలరించారు. తమ కామెడీ ప్రదర్శనలు, డాన్సులతో స్థానికులను ఉత్సాహపరిచారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి నటులతో ఫోటోలు దిగారు.