కృష్ణా: గుడివాడలోని రుద్రరాజు సత్యనారాయణ ప్రాంగణంలో ఏపీ రైతు సంఘం కృష్ణాజిల్లా 46వ మహాసభ ఆదివారం జరిగింది. ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ.. పంటల ధరలు సగానికి సగం పడిపోయాయని, ప్రభుత్వం 50 మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెబుతుందన్నారు. మార్కెట్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలిపారు.